సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం తో ఉద్రిక్తతలు సద్దమణిగాయి. దీంతో గురువారం ముడి చమురు ధరలు పడిపోయాయి. బ్యారెల్‌కు 72.48 డాలర్లకు దిగొచ్చి యుద్దం ముందున్న ధరలకు మళ్లీ చేరుకున్నాయి. భారత్ లో కూడా రిటైల్ గా పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించవలసి ఉంది. ఈ నేపథ్యంలో గత బుధవారం భారీ లాభాలను ఆర్జించిన దేశీయ సూచీలు నేడు గురువారం కూడా అదే జోష్‌తో ప్రారంభమయ్యాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి (94.28) బలపడడం సూచీలకు సానుకూలంగా మారింది, గత సెషన్ ముగింపు (76,991)తో పోల్చుకుంటే నేటి గురువారం ఉదయం సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 77,418 వద్ద దూసుకొని పోయినప్పటికీ సాయంత్రం ముగింపు సమయానికి సెన్సెక్స్ 109.25 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 77,100.47 వద్ద ముగిసింది. నిఫ్టీ స్వల్ప లాభంతో 34.35 పాయింట్లు లేదా 0.14 శాతం లాభంతో 24,056.00 వద్ద స్థిరపడింది.
