సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వైసీపీ పార్టీలో కీలకనేత, కాపు వర్గానికి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుమార్తె డాక్టర్ ,శ్రీజ పెళ్లి అమెరికాలో తాజగా జరిగింది. ఆమెది పెద్దలు ఆమోదించిన ప్రేమ వివాహం కావడం తో ఈ వేడుకలో అమెరికాలో అంబటి రాంబాబు దంపతులు.. వరుడి తరఫు తల్లి తండ్రులు బంధువుల సమక్షంలో ఇల్లినాయిస్లోని మహా లక్ష్మీ ఆలయంలో హిందూ సాంప్రదాయ పద్దతుల్లో వివాహ వేడుక నిర్వహించారు, . డాక్టర్ అంబటి శ్రీజ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్లో ఎండోక్రైనాలజీ విభాగంలో ఫెలోషిప్ చేస్తున్నారు. వరుడు కమ్మ వర్గానికి చేరిన జాస్తి హర్ష అమెరికాలో డోయిచ్ బ్యాంక్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. అంబటి అల్లుడు హర్దది పశ్చిమగోదావరి జిల్లా తణుకు కావడం గమనార్హం.
