సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: వంటలో చక్కటి రుచి కాస్త పులుపు ను జోడించే టమాలు రిటైల్ మార్కెట్లో ధరలు ఒక్కోసారి కేజీ వందల మీదకు వెళ్ళితే అంతలోనే ధరలు ఢమాల్ అంటూ 1కేజీ కేవలం 10 రూపాయలు కూడా పడిపోతుంటాయి. ఇక ఈ పంట ఎక్కువ పండించే రాయలసీమ రైతుల కష్టాలు మీడియాలో ఎప్పుడు వార్తలలోనే ఉంటాయి. తాజగా టమాట ధరలు దారుణంగా పడిపోయాయి. టమాటా పంట డిమాండ్ అసలు లేకపోవడంతో ఏకంగా కిలో 2రూపాయలు పలుకడంతో రైతులు కన్నీరుకారుస్తూ పంట ను అలానే వదిలేస్తూన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ టమాటా కు పెద్ద హోల్ సేల్ మార్కెట్.. నేటి సోమవారం పరిస్థితి లో అసలు కొనేవారు లేరు. దసరా పండగ ముందు వరకు కిలో రూ.8 నుంచి 10 పలకగా.. గత ఆదివారం మాత్రం ఒక్కసారిగా రూ.4కు పడిపోయింది. దీంతో ఆరుగాలం పడించిన పంటను రైతులు రోడ్డుపై పారబోశారు. రైతుల ఆందోళనతో గుత్తి-మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్ ఏర్పడటంతో వాహనదారులు గందరగోళపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతలు డిమాండ్ చేశారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా త్వరగానే పూర్తి చేయాలని అన్నారు.
