సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారత దేశంలోని వెనుక బడిన జిల్లాలో వ్యవసాయ స్థిరీకరణ చేసేందుకు, రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం ధన్ ధాన్య యోజన(PM Dhan Dhanya Yojana) అనే పథకాన్ని నేడు, శనివారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టి్ట్యూట్‌లో రైతుల సమావేశంలో ప్రారంభిస్తున్నారు. ఆధునిక పద్దతులలో వ్యవసాయం చేసేందుకు, రైతుల ఆదాయం పెంచడంకోసం తీసుకొచ్చిన ఈ పథకం ద్వారా వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. అంతే కాకుండా రైతులకు అనుభవజ్ఞులు శాస్త్రవేత్తలు తో శిక్షణా కార్యక్రమాలను చేపట్టనున్నారు. తొలిదశలో ఈ పథకాన్ని ఉత్పాదక ఉన్న 100 వ్యవసాయక జిల్లాల్లో అమలు చేయనున్నారు. తొలుత తెలంగాణలోని జనగామ, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్లో అమలు చేయనున్నారు. అదే విధంగా ఏపీలోని అల్లూరి సీతారామరాజు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లో ప్రారంభించనున్నారు.
