సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పేకాట క్లబ్ లు నిర్వహణలో డీఎస్పీ జయసూర్య ఫై తనకు పిర్యాదులు వచ్చాయని పశ్చిమ గోదావరి జిల్లా, ఎస్పీ అదాన్ హస్మి కు డిప్యూటీ పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan ) ఇచ్చిన ఆదేశాలు తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కేవలం ఒక్క పోలీస్ అధికారి మాత్రమే భీమవరం సెంటర్ లో కోట్ల రూపాయలు చేతులు మారే జూదశాల నిర్వాహకులతో లాబీయింగ్ చేస్తున్నారా?ఎవరైనా కావచ్చు.. దీని వెనుక రాజకీయ పెద్దలు ఎవరు లేరా ? మరి అందరిని సమ దృష్టితో చూడాలని ఎవరిని ఉపేక్షించవద్దని పవన్ ఇచ్చిన ఆదేశాలు జిల్లా ఎస్పి తుచ తప్పకుండ పాటిస్తే రాజకీయ వత్తిడి ఉండదా? పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అనధికారికంగా ఎన్నో క్లబ్ లు కూటమి నేతలు నిర్వహణలో జరుగుతున్నాయని ఎన్నో వార్తలు వస్తున్నాయి. సీఎం చంద్రబాబు సైతం ఎన్నో సారులు అసాంఘిక శక్తులకు, అవినీతికి దూరంగా ఉండాలని టీడీపీ ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు. సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, పవన్ చేసిన పిర్యాదు రుజువు అయితే ఆయనపై చర్యలు కు పోలీస్ పెద్దలు ఉపక్రమించ వచ్చు.. మరి ఆయన వెళ్లిన వెంటనే భీమవరంలో అనధికార క్లబ్ లు నిర్వహణ ఆగిపోతుందా? కేవలం పోలిసుల అదుపులోనే క్లబ్ ల నిర్వహణ? ఎవరి ప్రోద్బలం లేకుండా సివిల్ విషయాలలో పోలిసు బెదిరింపులు ఉంటాయా? ఇలా ఎన్నో ప్రశ్నలు ఫై జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతుంది. ఒకవేళ ‘పవన్ చొరవ’ రాజకీయాలకు అతీతంగా మరింత పట్టుదలగా అసాంఘిక కార్యకలాపాలపై ద్రుష్టి పెడితే మంచి ఫలితాలు చూడవచ్చు.
