సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: A I రాకతో సాఫ్ట్ వెర్ ఉద్యోగుల సంఖ్యా తగ్గిపోతుందన్న ప్రపంచ ఆందోళనల మధ్య భారత్ లో సాంకేతిక విద్యలో యువతఎంతటి ప్రజ్ఞావంతులో ఎటువంటి కష్టతరమైన విద్యనైనా అలవోక పట్టేస్తారని, క్రమ శిక్షణతో పనిచేస్తారని అన్నది ప్రపంచం ఎప్పుడో గమనించింది. ఇరాన్ యుద్ధం తరువాత ప్రపంచ పరిణామాలు మరింత వేగంగా మారుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం ముందుచూపుతో విదేశాలతో చేసుకొన్నా ఒప్పందాలతో AI టెకనాలజీ పరంగా ‘నిష్ణాతులు’ అయిన భారతీయ యువతకు మరిన్ని మంచి అవకాశాలకు మార్గాలు తెరుచుకున్నాయి. ఇప్పటికే ‘అన్ని రకాలుగా సురక్షితమైన’ భారత ఏఐ, క్లౌడ్‌ సేవల మార్కెట్‌పై పట్టు కోసం ‘అమెరికా టెక్నాలజీ కంపెనీలు’ ఐరోపా కంపెనీలు పోటాపోటీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దేశంలో ఏఐ, క్లౌడ్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ ఇప్పటివరకు మొత్తం 5,700 కోట్ల డాలర్ల (దాదాపు రూ.5.42 లక్షల కోట్లు) పెట్టుబడులను ప్రకటించాయి. మైక్రోసాఫ్ట్‌.. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రపంచంలో అతిపెద్ద అతిపెద్ద డేటా సెంటర్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. అలాగే, అదానీ సహకారంతో గూగుల్‌ వైజాగ్‌లో లక్ష కోట్ల రూపాయలు నిధులతో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. వైజాగ్ లో మరిన్ని ప్రపంచ దిగ్గజ సాఫ్ట్ వేర్ కంపెనీలు రానున్నాయి. దేశంలో రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతో కలిసి జామ్‌నగర్‌లో ఏఐ డేటా సెంటర్‌ను లక్షల కోట్ల రూపాయలు నిధులతో ఏర్పాటు చేయబోతున్నట్లు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ మెటా ఇటీవల ప్రకటించింది. ఇదే జోరు కార్యరూపం దాల్చితే భారత్‌ డేటా సెంటర్లు, ఏఐ మౌలిక వసతులలో ‘ప్రపంచ నెంబర్ 1… AI హబ్‌’గా భారత్ అవతరించేందుకు రంగం సిద్ధం అవుతుంది.. సిగ్మా ప్రసాద్ కాలమ్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *