సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగునాట చిన్న తిరుమలగా ప్రసిద్ధి పొందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమలలోని శ్రీ చిన్నవెంకన్న స్వామిని దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఆలయం కూడా చాల అభివృద్ధి చెంది భక్తులకు ఎన్నో సౌకర్యాలు కలిగించారు. అయితే ఇటీవల ద్వారకా తిరుమల ఆలయం పరిసర ప్రాంతాలలో విష సర్పాలు తరుచుగా కనిపిస్తుండటం భక్తులకు భయాందోళనకు గురిచేస్తుంది. తాజగా ద్వారకాతిరుమల చిన్న వెంకన్న గోశాలలో రెండు ఆవులు పాము కాటుకు గురై మృతి చెందాయి. గోశాల నుంచి గోపూజ కోసం సప్త గోకులం వద్దకు ఆవులను సిబ్బంది తీసుకెళ్లారు.అక్కడ ఉన్న గడ్డిని ఆవులు మేస్తున్నాయి. ఈ సమయంలో ఆవులను అక్కడ ఉన్న 3 త్రాచుపాములు కాటు వేశాయి. దీంతో రెండు ఆవులు విపరీతమైన బాధతో క్రింద పడి కొట్టుకొని మరణించడం జరిగింది. ఆలయ సిబ్బంది ఆ ఆవులను తొలగిస్తున్నపుడు వాటి క్రింద పడి నలిగిపోయి మరణించిన 3 త్రాచుపాములు కూడా చనిపోవడం గమనించారు. ఏది ఏమైనా పాముల పట్ల దేవాలయ సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఇటీవల కేశ ఖండన శాల వద్ద ఒక మహిళా పాము కాటుకు గురియై హాస్పటల్ లో కోలుకొంది ( up file photo)
