సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలు చవి చూసింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 25 శాతం ఫెడ్ తగ్గించినప్పటికీ, గత బుధవారం విదేశీ ఇన్వెస్టర్లు రూ.2, 500 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం కూడా నెగిటివ్‌గా మారింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ గురువారం భారీ నష్టాలను నమోదు చేశాయి. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్లు కోల్పోయి 84, 312 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. చివరకు 592 పాయింట్ల నష్టంతో 84, 404 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 176 పాయింట్ల నష్టంతో 26, 877 వద్ద స్థిరపడింది (stock market ).నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 52 పాయింట్ల నష్టంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 354 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 88.69గా నిలచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *