సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోనుంది. దేశంలో ఆర్యవైశ్యలకు పవిత్ర పుణ్య క్షేత్రం పశ్చిమగోదావరి జిల్లా లోని పెనుగొండ పట్టణం పేరును మార్చబోతున్నట్లు ప్రకటించారు.నేడు, శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండీ రాకేశ్ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా పలు వినతుల్ని మంత్రికి అందజేశారు. అయితే తమ కుల దేవత శక్తి స్వరూపిణి , శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారు జన్మించిన పెనుగొండ గ్రామాన్ని ‘ వాసవీ పెనుగొండ ‘గా మార్చాలని విజ్ఞప్తి చేసారు. వారి విజ్ఞప్తి పరిశీలించిన మంత్రి సవిత వారితో మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లుగా మీరు చేస్తున్న ఈ ప్రతిపాదనకు ఈసారి కూటమి సర్కార్ సానుకూలంగానే ఉన్నామని. దీనికి సంబంధించిన జీవో త్వరలోనే విడుదల అవుతుందన్నారు. పెనుగొండ గ్రామానికి ‘వాసవీ పెనుగొండ’ అని పేరు మార్చడం.. ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన కన్యకాపరమేశ్వరి అమ్మవారికి గౌరవం ఇవ్వడమేనని మంత్రి సవిత అన్నారు. .
