సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: మొన్న ది.28.10.2025 తేదీన బంగాళాఖాతములో ఏర్పడిన మొందా తుఫాను నరసాపురం, అంతర్వేది మీదుగా తీరం సమీపిస్తున్న సమయములో అంతర్వేది నుండి వచ్చిన ప్రత్యేక పవనాలు వల్ల తుపాను గాలులు విచ్చిన్నం అయ్యి తుపాను ప్రచండ వేగం విచ్చిన్నం అయిందని పలు పత్రికలలో వచ్చిన శాస్త్రీయ కధనాలు నేపథ్యంలో.. ప్రజలకు ఎటువంటి నష్టము వాటిల్లకుండా తుఫాను యొక్క తీవ్రత తగ్గి తీరము దాటినది. ఇది అంతయు శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి కృపా కటాక్షములతో మాత్రమే సాద్యము అయినదని పశ్చిమ గోదావరి జిల్లా, కోనసీమ జిల్లాలోని భక్తులు భావిస్తున్నారు. అందువలన శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారికి వారి కృతజ్ఞత భావముతో ది. 04–11-2025 వ తేది మంగళవారం ఉ.గం. 8-00 ల నుండి ‘’మహా శాంతి హోమము’’ నిర్వహించుటకు సంకల్పించామని అసిస్టెంట్ కమీషనర్ & ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ M.K.T.N.V. ప్రసాద్ ఒక ప్రకటన చేసారు. ఈ కార్యక్రమములో పాల్గొని భారీ అన్నసమారాధన ప్రసాదములు స్వీకరించి తరించవలసినది విజ్ఞప్తి చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *