సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేడు, శనివారం తీవ్ర విషాదంలో స్పాట్ లోనే తొమ్మిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.డిప్యూటీ సీఎం , పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. మృతులలో ఒక చిన్నారి ఉండటం తనను కలచివేసిందని అన్నారు. గాయాలు పాలయిన వారిని మంచి వైద్యం తో కాపాడాలని అన్నారు. దేవాలయాల వద్ద ప్రవిత్ర దినాలలో ముందస్తు ఏర్పాట్లు ఉండాలని అధికార యంత్రాంగం శ్రద్ద చూపాలని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *