సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉక్రెయిన్‌ ఫై రష్యా ఆక్రమణ దాడులు సుమారు 4 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. మెల్లమెల్లగా ఒకనాటి సోవియట్ యూనియన్ లో భాగం అయిన ఉక్రెయిన్‌ ను తిరిగి రష్యాలో కలిపివేసే పనిలో పుతిన్ ఉంటె ఎందరో అమాయకులు దానికి బలి అవుతూనే ఉన్నారు. అటు ఉక్రెయిన్‌ అడ్జక్షుడు జలాన్స్కెయ్ లోను చేవ తగ్గలేదు.. ఇందులో తప్పు ఒప్పులు వెదకలేం కానీ .. గత శనివారం రష్యా మొత్తం 45 క్షిపణులు, 458 డ్రోన్‌లతో జరిపిన భారీ దాడుల్లో ఆరుగురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఎందరో గాయపడ్డారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. ఉక్రెయిన్‌లోని నిప్రో, జఫోరిజ్జియా నగరాలపై గృహ సముదాయాలపై రష్యా ప్రయోగించిన మొత్తం 45 క్షిపణుల్లో 32 బాలిస్టిక్ క్షిపణులే కావడం గమనార్హం. రష్యా ప్రయోగించిన 458 డ్రోన్‌లలో 406 డ్రోన్‌లను, తొమ్మిది క్షిపణులను తమ సైన్యం గాల్లోనే పేల్చేసినట్టు ఉక్రెయిన్ వైమానిక అధికారులు తెలిపారు. ఇక రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల మేరకు అణ్వస్త్ర పరీక్షలను నిర్వహించడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ తాజాగా ప్రకటించడం ఆందోళనకర అంశం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *