సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హిందూపురం లో వైసీపీ నేత వేణు రెడ్డి బాలకృష్ణపై నుద్దేశించి ఎవడో.. హైదరాబాద్ లో ఉండే వాడు ఇక్కడ మనలను పాలిస్తున్నాడు.. మన హిందూపురం ప్రజలవి బానిస బ్రతుకులు.. అంటూ చేసిన వ్యాఖ్యాలకు నిరసనగా గత శనివారం హిందూపురంలో అధికార టీడీపీ నేతలు స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన విషయం అందరికి తెలిసిందే. ఈ దాడిలో వైసీపీ కార్యాలయం అద్దాలు, ఫర్నీఛర్, అక్కడే ఉన్న ఓ వాహనం ధ్వంసం అయ్యాయి. వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కూడా దాడి చేశారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. ఈ దాడిని వైఎస్సార్‌సీపీ తీవ్రంగా ఖండించింది. నేడు, ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన నేపథ్యంలో హిందూపురంలో మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలు తమపై టీడీపీ దాడిని ఖండిస్తూ బాలకృష్ణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నేడు నిరసన తెలిపేందుకు వెళ్తున్న వైఎస్సార్‌సీపీ నేతలను పోలీసులు అడుగడుగున అడ్డుకున్నారు..కదిరిలో వైఎస్సార్‌సీపీ నాయకులు సతీష్ రెడ్డిని అడ్డుకుని.. హిందూపురం వెళ్లకుండా ఆంక్షలు విధించారు. మరోవైపు.. హిందూపురం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దీపికకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అలాగే, కదిరి వైసీపీ నేత సమన్వయకర్త మక్బూల్‌ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.
