సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఉత్సవాలు తరువాత ఆ స్థాయిలో 13 రోజులు పాటు జరిగే నందమూరు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారి 60వ వార్షికోత్సవాలు ఈ డిసెంబర్ 3 నుండి ప్రారంభం కానున్నాయి. ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభిస్తారు. నందమూరు శ్రీఆంజనేయస్వామి అంటే జిల్లాలో తెలియనివారు ఉండరు. ఉత్సవాలలో శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. ఇక్కడ అభయ ప్రదాత, ఎంతో మహిమానిత శ్రీ ఆంజనేయ స్వామివారి ని దర్శించకుండా ఏ వాహనదారుడు ముందుకు వెళ్లాడంటే అతిశయోక్తి కాదు.. ప్రతి ఏడాది 13 రోజులు పాటు భారీ సెట్టింగ్స్, లైటింగ్, భారీ ఎగ్జిబిషన్ లతో, జానపద కళాకారుల పురాణ నాటక ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా చివరి రోజు డిసెంబర్ 15వ తేదీ భారీ అన్నసమారాధనతో.. ఈ వేడుకలును ఘనంగా స్థానిక శ్రీ రామ భక్త ఆంజనేయ స్వామి వారి ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *