సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత సోమవారం భారీ నష్టాలలోకి పడిపోయిన దేశీయ సూచీలు నేడు మంగళవారం ఉదయమంతా లాభాల్లోనే కదలాడిన సూచీలు మధ్యాహ్నం తర్వాత తిరిగి నష్టాల బాట పట్టాయి. రేపు బుధవారం అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెల్లడిస్తారు అని అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలుతో నేడు మంగళవారం కూడా భారత్ లో కూడా సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాలతో రోజును ముగించాయి. (stock market). గత సెషన్ ముగింపు (84, 900)తో పోల్చుకుంటే నేడు చివరి గంటలో నష్టాల్లోకి జారుకుంది. చివరకు సెన్సెక్స్ 313 పాయింట్ల నష్టంతో 84, 587 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడింది. చివరకు 74 పాయింట్ల నష్టంతో 25, 884 వద్ద స్థిరపడింది. నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 216 పాయింట్ల లాభంతో రోజును ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 15 పాయింట్లు కోల్పోయింది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.22గా ఉంది.
