సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అక్కినేని నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 9 ముగింపుకు చేరుకుంది. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి నెలకొంది. అయితే ఏడుపులు రాకాసిగా పేరున్న ‘తనూజ’ ను ఈసారి బిగ్ బాస్ విన్నర్ చెయ్యాలన్న తపన నిర్వాహకులు కు ఉన్నట్లు? ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆమె ఏమి చేసిన ఒకటి 2 సార్లు మినహా ఆమెకు నాగార్జున భరోసా, స్వష్టంగానే కనపడుతుంది. ఇక ముందు నుండి పవన్.రీతూ జంటకు తన అండదండలు ఉన్నాయి అని నాగార్జునే బహిరంగ పరచుకొన్నాడు, వారిద్దరి జోలికి ఎవరు వచ్చిన సహించడు అని.. నిన్న శనివారం ఎపిసోడ్లో.. నటి సంజన ను వారి క్షమాపణ కోరమన్నపుడే ‘నాగ్’ కామిడి తరహాలో దిగజారిపోయాడు. హౌస్ లో వారి చేష్టలు? బయటకు చెప్పలేను.. నాకు చిరాకు తెప్పిస్తున్నాయి. హౌస్ నుండి బయటకు వెళతాను కానీ వారికి సారి చెప్పను.. అని సంజన ఖరాకండిగా పలు మార్లు చెప్పడంతో .. ఎదో హడావిడి చేద్దామనుకున్న నాగ్ ఇక సంజనను నీపై బయట ప్రేక్షకులు బ్లాక్ మార్క్ వేస్తారని సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ చేసి చివరకు ఎలానో సారి చెప్పించుకొన్న తీరు నాగార్జున మనస్తత్వాన్ని ప్రస్ఫుటం చేసింది, సంజన స్థాయి పెరిగిపోయింది. ఇక గేమ్ లో ‘రీతూ’ను ను తప్పుపట్టిన కళ్యణ్ ను ఏకంగా ‘పీక’పట్టుకొన్న పవన్ విషయం హెచ్చరించకుండా..తన మాటల గారడితో తేలిక చేసి పారేసారు నాగ్.. అదే పవన్ గతంలో రీతూను ను ప్రక్కకు నెట్టితే ఇక నాగ్ ఆగ్రహం చూడాలి.. ఆస్కార్ ఇచ్చేయాలి. పవన్ ను మోకాలు దండం వేస్తే కానీ వదలలేదు. ఇదే నాగ్ గతంలో భరణి, దివ్య తనూజ కాంబినేషన్ ఫై మాత్రం ప్రేక్షకుల కన్నా తానే ఎక్కువ సెటైర్స్ వెయ్యడం ప్రేక్షకులను ప్రభావితం చెయ్యడం అందరు గమనించిందే.. ఇక నేడు ఆదివారం ఎపిసోడ్ లో ఈ ఈ వారం సంజన, సుమన్ శెట్టి, దివ్య డేంజర్ జోన్ లో ఉండగా.. అత్యదిక ఓటింగ్ తో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నాడు కళ్యాణ్. ఈ వారం దివ్య నిఖిత, సంజన, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, భరణి డేంజర్ జోన్ లో ఉన్నారు. అయితే అతి తక్కువ ఓటింగ్ కారణంగా దివ్య ?బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ‘వినోదం’ విషయానికి వస్తే ఈ సీజన్ 9 బెస్ట్ అని చెప్పాలి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *