సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: తొలిచిత్రం RX 100 తో హీరోగా సంచలన విజయం నమోదు చేసిన గోదావరి జిల్లాల కుర్రాడు కార్తికేయ అటు హీరోగా ఇటు తమిళ్ లో పెద్ద సినిమాలలో విలన్ గా కూడా కొద్దీ సినిమాలతోనే పెద్ద పేరు తెచ్చుకొన్నారు. అయితే తెలుగులో ఓ మోస్తరు హిట్ సినిమాలతో హీరో వేషాలు తగ్గడంతో ఇకపై సినీ రంగానికి దూరంగా విద్య వ్యాపారం ప్రారంభించారు. కార్తికేయ తండ్రి విఠల్ రెడ్డి నాగార్జున గ్రూప్ అఫ్ స్కూల్స్ ను తెలుగు రాష్ట్రాలలో నిర్వహిస్తున్నారు. సరైన వేషాలు లేకపోవడం తో ఇకపై సినిమా రంగానికి దూరంగా కార్తికేయ కూడా తన తండ్రి నిర్వహిస్తున్న నాగార్జున గ్రూప్ అఫ్ స్కూల్స్ కు బోర్డు డైరెక్టర్ గా కొత్త బాధ్యతలు తీసుకొన్నారు. అవకాశాలు లేక నిరాశపడేకంటే ఇలా కొత్త వ్యాపారరంగాలలోకి వెళ్ళటం అభినందనీయం
