సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పలు సారులు ఎమ్మెల్యేగా గెలిచిన కామ్రేడ్, తెలంగాణ తెలుగుబిడ్డ, ప్రజలలో ఒకడిగా వారి కష్టసుఖాలు తెలిసిన అతి సామాన్యుడుగా పేదల పక్షపాతి, కారు భవంతులు, ఎటువంటి సౌఖ్యాలు కోరుకోకుండా తనకున్న సైకిల్‌ పై అసెంబ్లీకి వెళ్లిన ఇల్లందు మాజీ శాసన సభ్యుడు గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah) జీవిత కథను అదే పేరుతో ఎన్‌.సురేశ్‌రెడ్డి. సినిమాగా తీస్తున్నారు ఆ చిత్రంలో తెలుగు తెరపై తొలిసారి కన్నడ మెగా హీరో శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) టైటిల్‌ పాత్రను పోషిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ గతశనివారం పాల్వంచలో మొదలైంది. ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రధాని నరేంద్రమోదీకి చూపిస్తామని అన్నారు. హీరో శివ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘నా తండ్రి రాజ్ కుమార్ లాంటి భావాలూ ఉన్న మనిషి గుమ్మడి నర్సయ్యని చూస్తునాను. ఒక మంచి వ్యక్తి పాత్రను పోషిస్తున్నందుకు ఆనందంగా, గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుంటా.. నేనే డబ్బింగ్‌ చెబుతా’ అని అన్నారు. గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah)మాట్లాడుతూ ‘వ్యవస్థలో మార్పు రావాలంటే ముందు మనలో మార్పు రావాలి. నేనేం గొప్ప నాయకుడిని కాదు.. అందరిలా సామాన్యుడినే. నన్ను గొప్పగా కాకుండా నా భావాలను మాత్రమే ఈ సినిమాలో చూపించాలని, చూపిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *