సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో పోలీసు శాఖలో హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, పోలీసులతో సమానంగా నిరంతరం హోంగార్డులు అందిస్తున్న సేవలు అమోఘమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు నివాసం వద్ద హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని విధులలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డ్స్ దంతులూరి కృష్ణంరాజు, జాన్సన్, ఎం రామరావు, డి పెద్దిరాజు, కెకె దాసు లను సత్కరించారు.వరదలు సంభవించినపుడు, శాంతిభద్రతల పరిరక్షణలో,ఎన్నికల సమయంలో రోజువారీ విధులలో హోంగార్డ్ లు అంకిత భావంతో సేవలందిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రమణ్యం , కంతేటి వెంకట్రాజు, భట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీనివాస్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *