సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: గుడివాడలో నేడు. ఆదివారం తెల్లవారుజామున నెహ్రూ చౌక్‌లోని షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకొంది. ఆ మాల్ లో ముందుగా ఒక సెల్‌ఫోన్ షాపులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది అని భావిస్తున్నారు. కొద్దిసేపటికే మంటలు సెల్ ఫోన్ షాపు నుంచి పక్కన ఉన్న షాపులకు వ్యాపించాయి. కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటల్ని ఆర్పడానికి శ్రమించి ఎట్టకేలకు ఉదయం 9న్నర గంటలకు అదుపులోకి తెచ్చారు. భారీ మంటలతో సమీప ప్రాంతాల నివాసదారులు భయాందోళనకు గురయ్యారు. .తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. అగ్ని ప్రమాదం గురించి తెలుసుకుని దుకాణదారులు కాంప్లెక్స్ వద్దకు చేరుకొని తమ షాపులు మంటల్లో కాలిపోవటం చూసి కంటతడి పెట్టుకొన్నారు. ఆస్థి నష్టం భారీగానే ఉండే అవకాశం ఉంది.
