సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నటభూషణ ‘శోభన్ బాబు’ హీరోగా నటించిన సోగ్గాడు సినిమా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ డి సురేష్ బాబు, అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలను నేడు, శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు శోభన్ బాబు మనవడు డా సురక్షిత్, పి సుశీల, అట్లూరి పూర్ణ చంద్రరావు, జయసుధ,జయచిత్ర, రాధిక, ప్రభ, సుమలత, రచయిత, మాజీ రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, దర్శక, నిర్మాతలు రేలంగి నరసింహారావు, కేఎస్ రామారావు, కేవీ సత్యనారాయణ, అశోక్ కుమార్, రాజు, భీమవరం నుండి రామ సత్యనారాయణ, భట్టిప్రోలు శ్రీనివాస్ రావు, వీరప్రసాద్, మరియు, ఆంధ్రా తెలంగాణ శోభన్ బాబు ఫ్యాన్స్ అభిమానులు పాల్గొన్నారు.
