సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: హోస్ట్ అక్కినేని నాగార్జున, సందడి మధ్య, హీరో రవితేజ ప్రత్యేక ఆకర్షణగా గత ఆదివారం రాత్రి స్టార్ మా ఛానెల్ లో ముగిసిన తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌గా కల్యాణ్ పడాల నిలిచాడు. ఏడుపుల రాణి, తనూజ ను తట్టుకుని ఫైనల్‌గా ఎవరు విజేత గా గెలుస్తారో? అనే ఉత్కంఠ మాత్రం ఇన్ని రోజులు కొనసాగింది. అయితే విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేటకు చెందిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. కామనర్ కేటగిరీలో షోలో అడుగుపెట్టిన కళ్యాణ్, తన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, సహనం, తెగించిన ఆటతీరుతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుని చివరికి విజేతగా నిలవడం విశేషం. తండ్రి కిళ్ళీ బడ్డీ .. పేద కుటుంబ నేపథ్యంతో వచ్చిన కళ్యాణ్ ఈ విజయంతో ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలిచారు. భారత ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న కళ్యాణ్ గతంలో సైనిక జీవితంలో అలవడిన బాధ్యత భావం, మిగతా వ్యక్తులతో గౌరవప్రదంగా వ్యవహరించడం బిగ్ బాస్ షోలోనూ స్పష్టంగా కనిపించాయి. ఇక 2వ స్థానంలో తనూజా , మూడవ స్థానంలో తణుకు కుర్రాడు ‘డిమో పవన్’ 15 లక్షల ప్రత్యేకప్రైజ్ మని కూడా సాధించడం విశేషం.
