సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నిన్న సోమవారం భారీ లాభాలను ఆర్జించిన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు మంగళవారం మధ్యాహ్నం 12-30 కి స్వల్ప లాభాలతోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. . క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఈ వారం స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ చేసే వారికి ఒక ముఖ్య గమనిక. ఈనెల డిసెంబర్ 25 (గురువారం)నాడు స్టాక్ మార్కెట్ కు సెలవు. అయితే కేవలం ఈక్విటీ మార్కెట్లు మాత్రమే కాకుండా, ఇతర విభాగాలకు కూడా సెలవు వర్తిస్తుంది.డిసెంబర్ 26 (శుక్రవారం): మార్కెట్లు తిరిగి యథావిధిగా పనిచేస్తాయి. తదుపరి డిసెంబర్ 27, 28 (శని, ఆది): వారాంతపు సెలవులు ఎలానూ ఉన్నాయి అని గమనించాలి.
