సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏడాది ముగింపులో అంతర్జాతీయ పరిణామాలు నేపథ్యంలో మరోసారి బంగారం , వెండి ధరలు వేగంగా భారీ స్థాయిలో తగ్గిపోతున్నాయి. నేడు, బుధవారం డిసెంబర్ 31న దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,36,190 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,24,840 వద్ద కొనసాగుతోంది.కిలో వెండి ధర రూ.2,39,900 వద్ద కొనసాగుతోంది. ఇది గత మూడు రోజుల కిందటి ధరతో పోలిస్తే దాదాపు రూ.19 వేల వరకు తగ్గింది. అదే హైదరాబాద్‌లో మాత్రం భారీగా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.2,57,900 వద్ద కొనసాగుతోంది. న్యూఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2,40,000 గా ఉంది. మొన్న సోమవారం ఉదయం విజయవాడ హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2 లక్షల .80వేలు లక్షలు పలికింది. మరోవైపు బంగారం కూడా గత మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.3 వేలకు పైగానే తగ్గింది. ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాలలో విజయవాడ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1, 36, 200గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 24, 850గా ఉంది.
