సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రపంచం లో వరిధాన్యం ఉత్పాదనలో భారత్‌ . చైనాను పైగా తాజగా .. అధిగమించి ప్రపంచంలో నంబర్‌ వన్‌గా నిలిచింది. గత ఏడాది మొత్తంగా 15.01 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి భారత్ ఈ ఘనత సాధించింది. ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రకటించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) ఆధ్వర్యంలో రూపొందించిన 25 పంటలకు సంబంధించిన 184 రకాల అధిక దిగుబడి విత్తనాలను ఆయన విడుదల చేశారు. ఆహార కొరత ఉన్న స్థితి నుంచి ప్రపంచానికే ఆహారం అందించే స్థాయి వరకు దేశం ఎదిగిందని, ఇది ఘన విజయమని ప్రశంసించారు. ‘‘గత ఏడాది చైనా 14.52 కోట్ల టన్నుల వరిని ఉత్పత్తి చేయగా, భారత్‌ 15.01 కోట్ల టన్నులను ఉత్పత్తి చేసింది’’ అని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లకు బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని, దేశంలో సమృద్ధిగా బియ్యం నిల్వలు ఉన్నాయని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *