సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు 14 ఏళ్లపాటు నిరీక్షణకు తెరపడిందని, భీమవరం యనమదుర్రు కాలువపై నిర్మించిన రెండు బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లకు వేసేందుకు రూ 24 కోట్ల 70 లక్షల నిధులు మంజూరు అయ్యాయని 14 ఏళ్లపాటు నిరీక్షణకు తెరపడిందని,తెలిపారు. ఈ అప్రోచ్ రోడ్ల పనులపై ఎన్నోసార్లు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లడం జరిగిందని, ఒక్క బ్రిడ్జికు మాత్రమే ప్రస్తుతం నిధులకు విడుదల చేస్తామని, త్వరలో చూద్దామని చెప్పేవారని, ఇప్పుడు రెండు బ్రిడ్జిలకు రూ 24 కోట్ల 70 లక్షలు నిధులు మంజూరు చేశారన్నారు. భీమవరం గంగనమ్మ గుడి దగ్గర, గొల్లవాని తిప్ప దగ్గర ఉన్న బ్రిడ్జిలకు అప్రోచ్ రోడ్లకు నిధులు మంజూరు అయ్యాయని, త్వరలోనే తొకతిప్ప దగ్గర ఉన్న మూడో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కోసం కృషి చేస్తానన్నారు. అలాగే ఎన్నో ఏళ్ళుగా నిరీక్షిస్తున్న టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు టిడ్కో గృహలను ఈ ఏడాది అందిస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *