సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు నేపథ్యంలో, మరోవైపు క్రూడాయిల్ ధరలు పెరగడం కూడా సూచీలను నష్టాల వైపు మళ్లించింది. మెటల్ సెక్టార్ భారీ నష్టాల్లో ఉంది. దేశీయ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా మిశ్రమ ఫలితాలు, నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత సెషన్ ముగింపు (84, 961)తో పోల్చుకుంటే గురువారం ఉదయం 200 పాయింట్లకు పైగా నష్టంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత కాస్త కోలుకుంది. ఒక దశలో లాభాల్లోకి వచ్చింది. అయితే కాసేపటికే తిరిగి మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. ఉదయం 10:00 గంటల సమయంలో సెన్సెక్స్ 216 పాయింట్ల నష్టంతో 84, 745 వద్ద కొనసాగుతోంది. మరో వైపు నిఫ్టీ కూడా 64 పాయింట్ల నష్టంతో 26, 076 వద్ద కొనసాగుతోంది నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 418 పాయింట్ల నష్టంతో ఉంది. బ్యాంక్ నిఫ్టీ 56 పాయింట్ల నష్టంతో ఉంది. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 89.81గా ఉంది.
