సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: బీఎస్ఎన్ఎల్ యూజర్లకు శుభవార్త!.. తాజగా..గతంలో మంచి డిమాండ్ ఉన్న బీఎస్ఎన్ఎల్ రూ. 1 రీఛార్జ్ ప్లాన్ మళ్లీ వచ్చేసింది. ఈ ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ పొందవచ్చు. సెకండరీ సిమ్ కోసం బీఎస్ఎన్ఎల్ వాడే యూజర్లకు అద్భుతంగా ఉంటుంది.బీఎస్ఎన్ఎల్ రూ.1 ప్లాన్ బెనిఫిట్స్, వ్యాలిడిటీ బీఎస్ఎన్ఎల్ భారత్ అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. అంతేకాదు.. ఈ ప్లాన్ యూజర్లకు రోజుకు 100 SMS బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. రోజుకు 2GB డేటా పొందవచ్చు. ఇంటర్నెట్, చాటింగ్, యూట్యూబ్ వీడియోలు లేదా ఇన్‌స్ట్రాగ్రామ్ రీల్స్ చూసేందుకు సరిపోతుంది. బీఎస్ఎన్ఎల్ కొత్త సిమ్ యాక్టివేట్ తేదీ నుంచి 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. మీ ఫోన్లో సెకండరీ నంబర్‌గా బీఎస్ఎన్ఎల్ సిమ్ కావాలంటే ఇప్పుడే పొందవచ్చు..
