సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: గత 10 ఏళ్ళు గా హిట్ సినిమా లేక ఓటిటి లో “ఆకాశ విధి “మినహా అన్ని పరాజయాలతో కొట్టుమిట్లాడిన తమిళ హీరో సూర్య కి ‘టైం’ వచ్చింది. ఇటీవల . అతను నటించిన ‘కరుప్పు’,( తెలుగులో వీరభద్రుడు) ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్’ సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. అదే ఊపులో ఈ యేడాది సూర్య నుంచి మూడో సినిమా ”సీన్‌”. నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంలో ‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి హిట్‌ చిత్రాలను రూపొందించిన జీతూ మాధవన్ దీనికి దర్శకుడు. ఈ సినిమాకు హీరో సూర్య, నిర్మాతగా వ్యవహరించారు. మరి ఈ సినిమా కధ విషానికి వస్తే.. ఎస్.పీ. ప్రేమ్‌ రాజ్ (సూర్య) పోలీస్‌ డిపార్ట్ మెంట్‌లో లెజెండ్‌. తను టేకప్ చేసిన ప్రతి కేసునూ చాలా తెలివిగా పరిష్కరిస్తారు. అసలు నేరస్థులను జైలుకు పంపుతాడు. అలాంటి ప్రేమ్‌ రాజ్ పెర్ఫ్యూమ్‌ కిల్లర్ విక్టర్‌ (టోవినో థామస్‌) నూ జైలు పాలు చేస్తాడు. అయితే ఆ తర్వాత రంగంలోకి దిగిన కాంట్రాక్ట్ కిల్లర్ ఈశ్వరన్‌ (నస్లీన్‌) పోలీసులను తప్పుదారి పట్టించడానికి పెర్ఫ్యూమ్‌ కిల్లర్ తరహాలో రెండు హత్యలు చేస్తాడు. దాంతో అందరూ ప్రేమ్‌ రాజ్‌ను అనుమానంగా చూస్తారు. తనకు చూపు తగ్గిన నేపథ్యంలో వ్యక్తిగత కారణాలతో ఉద్యోగానికి రాజీనామా చేయాలనుకున్న ప్రేమ్‌ రాజ్‌కు దీనిని ఛాలెంజ్‌గా తీసుకుంటాడు. అసిస్టెంట్‌ మాయ (నజ్రియా నస్రీన్‌) సాయంతో ఈ కేసును ఎలా ముగించాడో సినిమాలో చూడవలసిందే.. ఇక ‘సీన్’విశ్లేషణకు వస్తే.. సినిమా ప్రారంభంలో సూర్య ప్రవర్తన కాస్తంత అతిగా ఉంటుంది. అయితే ఆ తర్వాత చూపించిన సన్నివేశాలతో ఓకే అనిపిస్తాడు. . కళ్ళు కనిపించని హీరోకు చూపుగా మారిన మాయ అతనికి సహాయం చేయడం కంటే… నిర్లక్ష్యంతో అతన్ని తప్పుదారి పట్టించిన సన్నివేశాలే ఇందులో ఎక్కువ ఉన్నాయి. పోలీస్‌ డిపార్ట్ మెంట్‌ ను, అధికారుల స్థాయి తగ్గించే విధంగా, కామెడీగా చూపించారు. ఇక పోలీస్‌ ఆఫీసర్ గా సూర్య మరోసారి ‘సింగం’ సినిమాకు పూర్తి భిన్నంగా ఇందులో సూర్య వినోదాన్ని మేళవించాడు. అతని అసిస్టెంట్‌ మాయగా నజ్రియా చాల సహజంగా నటించింది.. కాంటాక్ట్ కిల్లర్‌గా నస్లీన్‌ అద్భుతంగా చేశాడు. కొన్ని సన్నివేశాలలో సూర్యను సైతం డామినేట్‌ చేశాడు. జ్యోతిక ఓ సన్నివేశంలో మెరుపులా మెరిసింది. సుషిన్‌ శ్యామ్‌ నేపథ్య సంగీతం బాగుంది. తెలుగు సంభాషణలకు నేటివిటీని అద్దడంతో బాగున్నాయి. ఇన్వెస్టిగేటివ్‌ క్రైమ్‌ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి ‘సీన్‌’ సినిమా పర్వాలేదనిపిస్తుంది. అద్భుతం మాత్రం కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *