సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల సంక్రాంతి పోరులో.. ‘మానవ సంబంధాలు, ఆత్మ పరమాత్మ యోగ రక్షణ’ లకు సంబందించి విభిన్న కధాంశంతో మారుతి అద్భుతంగ తీసిన రాజాసాబ్ చిత్రంతో ప్రశంసలు పొందుతున్నారు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్.ఫై కసితో కొందరు కావాలని ఎంత డివైడ్ టాక్ తెచ్చిన సరే రాజాసాబ్ కేవలం 10 రోజులకు సుమారు 260 కోట్లు పైగా కలెక్షన్స్ సాధించి సంక్రాంతి టాప్ సినిమా రేస్ లో కొనసాగుతుంది. భీమవరం టౌన్ లో 9 రోజులకు 1కోటి 21 లక్షల 58వేల రూపాయలు సాధించింది.( భీమవరంలో మెగా స్టార్ చిరంజీవి – వెంకీ మామ, శంకర వరప్రసాద్ సినిమా 6 రోజులకు 90లక్షల 17వేల 990 రూపాయలు కలెక్షన్స్ తో దూసుకొనిపోతుంది) ఇక అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నసందీప్ రెడ్డి దర్శకుడుగా స్పిరిట్ సినిమా 6నెలలు లో షూటింగ్ పూర్తీ చేసి, తన సినిమాలకు కలసివచ్చిన.. డిసెంబర్ లో విడుదలకు సిద్ధం చేస్తారని అందరు భావిస్తుండగా, నిర్మాత భూషణ్ కుమార్ తాజగా మాట్లాడుతూ.. . వచ్చే ఏడాది (2027) మార్చి నెల 5వ తేదీన సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి పిక్స్ చేశామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *