సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఉండి ఎమ్మెల్యే, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతీ రఘురామా కృష్ణంరాజు నేడు, శుక్రవారం మంత్రి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అంకితభావంతో అహర్నిశలు కృషి చేస్తున్న యువ నాయకుడు, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖల మంత్రి,, టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో లోకేష్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా జీవించాలని, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు రఘురామా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *