సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భారతీయ స్టాక్ మార్కెట్ లో వరుస నష్టాల ఊబి నుండి నిన్న గురువారం కాస్త కోలుకున్న సూచీలు నేడు, శుక్రవారం మళ్లీ నష్టాల బాట పట్టాయి. డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయికి పడిపోయి తేరుకోకపోవడం , క్రూడాయిల్ ధరలు పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు సూచీలను వెనక్కి లాగాయి. గత గురువారం సెషన్ ముగింపు (81,537)తో పోల్చుకుంటే శుక్రవారం ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సెన్సెక్స్ ఉదయం లాభాల్లోనే కొనసాగాయి. ఒక దశలో దాదాపు 200 పాయింట్లు లాభపడి 82,516 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అయితే మధ్యాహ్నం తర్వాత సూచీలు భారీగా పతనమయ్యాయి. చివరకు సెన్సెక్స్ 769 పాయింట్ల నష్టంతో 81,537 వద్ద రోజును ముగించింది. మరో వైపు నిఫ్టీ కూడా చివరకు 241 పాయింట్ల నష్టంతో 25,048 వద్ద స్థిరపడింది (stock market ).డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ 91.94గా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *