సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏలూరు జిల్లాలోని అటవీ ప్రాంతం సమీపంలో గత కొంతకాలంగా పెద్దపులి సంచారం( Eluru Tiger ) స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది. గత వారం అడవిలోకి వెళ్లిపోయిందని భావించినప్పటికీ తాజగా పెద్దపులి తిరిగి వచ్చి పోలవరం ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజగా ఇటుకలకోట గ్రామం వద్ద ప్రజల నివాస ఆవరణలోకి ప్రవేశించి ఆరుబయట కట్టేసి ఉన్న రెండు లేగదూడలపై దాడి చేసి చంపేసింది. దీంతో పశువుల కాపరులు, దూడల మృతదేహాలను చూసి చాల ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో ఉన్న పులి పాదముద్రలను అధికారులు సేకరించారు. పులి సంచారాన్ని కనిపెట్టడానికి అవసరమైన చోట్ల ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామస్థులు రాత్రివేళల్లో ఒంటరిగా బయటకు రావద్దని, పొలాల వద్దకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *