సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, బుధవారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్‌.అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ప్రజా సంక్షేమం అనే కోణంలోనే.. ప్రభుత్వం ప్రతీ నిర్ణయాన్ని తీసుకుంటోందని తెలిపారు. ఏడాదికి రూ.33వేల కోట్లతో సూపర్ సిక్స్ సహా ఇతర డీబీటీ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. 63.12 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ద్వారా ప్రయోజనం చేకూరుతోందన్నారు.రాష్ట్రంలో 66 లక్షలకు పైగా విద్యార్థులకు తల్లికి వందనం ద్వారా ఆర్థిక సాయం అందుతోందని గవర్నర్ ప్రకటించారు. .స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుతోందని తెలిపారు గవర్నర్. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల చొప్పున 46.86 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతోందన్నారు. దీపం 2.0 పథకం ద్వారా 1.08 కోట్ల మంది పేద కుటుంబాలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని పేర్కొన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 15,941 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో పాటు 5,757 మంది కానిస్టేబుళ్ల రిక్రూట్మెంట్ కూడా ప్రభుత్వం పూర్తి చేసిందని వివరించారు. లక్ష మందికి పైగా హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లపై ఆధారపడిన చేనేత కుటుంబాలకు 200, 500 యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్ అందిస్తోందని గవర్నర్ ప్రకటించారు. గంజాయి నిర్మూలనలో పురోగతి సాధించిందన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *