సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసన మండలి సమావేశాలు కొద్దిసేపు నిర్వహణ తదుపరి రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభ వాయిదా పడిన కొద్దిసేపటికే శాసనమండలి సైతం శుక్రవారానికి వాయిదా పడింది. నేడు, గురువారం ఉదయం రెండు సభలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు సభల్లో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. నేటి అసెంబ్లీ సమావేశాలలో.. నిన్న11వ తేదీన వైసీపీ ఎమ్మెల్యేలు 11 మంది సభలో11 నిమిషాలపాటు ఉండి వ్యవహరించిన తీరు, ప్ల కార్డ్స్ ప్రదర్శించిన తీరు, చేసిన నినాదాలు, వాకౌట్ చేసిన తీరు తనకు అసంతృప్తి కలిగించిందని, ఇదేనా చట్ట సభలలో వీరి బాధ్యత అంటూ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సెటైర్ వేశారు. తదుపరి రేపటికి వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *