సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుమల గా ప్రసిద్ధి పొందిన ద్వారకా తిరుమలఆలయంలో ప్రసాదాల తయారీలో కల్తీ జరిగిందని సిట్ తాజగా విడుదల చేసిన నివేదికలో పేర్కొనడం జరిగింది. వార్త కధనం ప్రకారం SIT నివేదికలోని ముఖ్యాంశాలు గమనిస్తే.. 2022 నుంచి 2024 మధ్య కాలంలో ఆలయానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ కాలంలో ప్రసాదాల తయారీకి అవసరమైన నెయ్యిని తిరుపతికి చెందిన వినాయక ఏజెన్సీ సరఫరా చేసినట్లు సిట్ గుర్తించింది. చిన్న వెంకన్న ఆలయంలో లడ్డూ, చక్కెర పొంగలి, స్వామివారి ఇతర కైంకర్యాలకు నెలకు సుమారు 15 వేల కేజీల నెయ్యి వినియోగిస్తారని అయితే అధికారుల పర్యవేక్షణ లోపం ?కారణంగా ఇది జరిగి ఉండవచ్చుననిభావిస్తున్నారు. దోషులఫై చట్టపరంగా చర్యలు తీసుకోవాలసి ఉంది. అయితే ఒక పూహ్యంతో, రాజకీయ కారణాలతో ఇటువంటి నివేదికలు వస్తే మాత్రం ఆ దేవదేవుడు క్షమించడని స్వామివారి భక్తులు భావిస్తున్నారు.
