సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణంలో రేపు శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు హోల్ సేల్ కూరగాయల మార్కెట్ కు సెలవు ప్రకటించారు. శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి నెల రోజుల ఉత్సవాలు ముగింపుగా రేపు భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లు లో తమ సభ్యులు పాల్గొనేందుకు వీలుగా స్థానిక నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో ఈ ప్రకటన విడుదలయింది.
