సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ యుద్ధ పరిణామాల వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో గ్యాస్ కష్టాలు రోజు రోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలెండర్లు కొరత తో హోటల్స్, రెస్టారెంట్స్ అత్యధికంగా భీమవరం ప్రాంతంలో ఇప్పటికే కట్టెల పొయ్యిలు, ఊక పొయ్యి, కరెంట్ పొయ్యి వినియోగం వైపు .హోటల్స్ యజమానులు ద్రుష్టి పెడుతున్నారు. అయితే స్టార్ హోటల్స్ వారు మెనూ లో ఐటమ్స్ బాగా తగ్గిస్తున్నారు. ఇక మరోవైపు గృహ అవసరాలకు గ్యాస్ సరఫరాలో వినియోగదారులు ఇబ్బందులు పడకుండా. గ్యాస్ సిలెండర్లు బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా జిల్లా కలెక్టరేట్ యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపట్టింది. జిల్లాలోని పలు గ్యాస్ ఏజన్సీలను సివిల్ సప్లయిస్ టీం, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే వినియోగదారులు . గ్యాస్ బుకింగ్ కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మని చెబుతున్నారు. జిల్లాలో గ్యాస్ సిలిండర్ బుకింగ్, డెలివరీ కోసం గ్యాస్ ఏజన్సీల వద్ద జనాలు క్యూ కడుతున్నారు. బుకింగ్ చేసు కున్న వినియోగ దారులకు కొంత ఆలస్యమైనా గ్యాస్ సిలిండర్లు సరఫరా కు ఇబ్బందులు లేవు.అయితే అసలే కోట్ల వ్యాపారం జరిగేపెళ్లిళ్ల సీజన్ కావడంతో జిల్లా వ్యాప్తంగా కల్యాణ మండపాలాలలో గ్యాస్ సిలెండర్లు కొరత నేపథ్యంలో కట్టెల పొయ్యే మీద వండే వంటగాళ్లకు, క్యాటరింగ్ కు డిమాండ్ పెరుగుతుంది.యుద్ధం మరో 7 రోజులలో ఆగకపోతే మాత్రం కనివిని ఎరుగని గ్యాస్ సంక్షోభాన్ని చవిచూడక తప్పదు
