సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి ముసాయిదా చట్టం పై భీమవరంలో ఆదివారం అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకి ప్రధాన వక్త హాజరైన పాకాల త్రినాథ్ మాట్లాడుతూ ఆలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే చట్ట సవరణ చేయాలన్నారు. ఈలోగా పూజ, ప్రసాద, కైంకర్య సేవలను అత్యంత భక్తిశ్రద్ధలతో నాణ్యతతో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. అలాగే వీటి ఆధారంగా నిర్వహించబడుతున్న సేవా సంస్థలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు. ట్రస్టు బోర్డులలో హిందూ ధర్మంపై శ్రద్ధ భక్తులతో ధర్మాచరణ చేసే రాజకీయ ఇతర ధార్మిక భక్తులను మాత్రమే నియమించాలన్నారు. ఆలయాల ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా, అన్యాక్రాంతమైన ఆస్తులను స్వాధీనం చేసుకొని ఆలయాలకు అప్పగించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి అన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు ఒబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేవాలయాల ఆదాయాన్ని హిందూ ధార్మిక ప్రచారానికి, హిందూ సమాజ సేవలకు మాత్రమే ఉపయోగించాలని అన్నారు. అంతేగాని ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉద్దరాజు వేణుగోపాల రాజు, దత్త పీఠాధిపతి శ్రీ నాగానంద సరస్వతి, తదితర ధార్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *