సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గత ఏడాదిగా ఏపీలో ఊహించని రీతిలో ఎన్నో బస్సు ప్రమాదాలు జారుతూనే ఉన్నాయి. తాజగా మార్కాపురం మండలం రాయవరం వద్ద నేడు, గురువారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొనగా వెంటనే అగ్ని మంటలు చేరేగడంతో బస్సులోని 13 మంది సజీవ దహనం అయ్యారు. మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తెలంగాణ రాష్ట్రం నిర్మల్ నుంచి ఏపీలోని నెల్లూరుకు బస్సు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు 5 లక్షల చప్పున సహాయం ప్రకటించారు. ప్రధాని మోడీ దీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *