సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో అడ్జక్షుడు ట్రంప్ స్థానిక ప్రజా ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వెనెజువెలాలో అధ్యక్షుడు మదురో అధికారిక నివాసంపై దాడి చేసి రాత్రికి రాత్రి కిడ్నాప్‌ చేసి అమెరికాకు తీసుకొచ్చిన ట్రంప్‌.. అదే అహంకారంతో లక్ష్యం లేకుండా ఇరాన్‌ మీద కూడా అదే ప్లాన్‌ అమలు చేయాలని భావించారు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ రాజధాని టెహ్రాన్‌లో సైనిక, పౌర ఉన్నతాధికారులతో సమావేశమైన తరుణంలో వారి మీద అమెరికా, ఇజ్రాయెల్‌ అకస్మాత్తుగా బాంబులు కురిపించాయి. కురిపించి ఆయనను మట్టుబెట్టాయి.ట్రంప్ ఊహించని అసలు సినిమా అప్పుడు మొదలయింది. ఒక ఇరాన్‌ను వారంలో లొంగదీసుకుంటానని ప్రగల్భాలు పలికినట్రంప్‌.. ఇరాన్ ఎదురుదాడి చేసిన తీరుకు అమెరికా భారీగా నష్టపోవడమే కాకుండా ప్రపంచానికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టి రాజి అంటూ .. 7 రోజులు తరువాత నెల రోజులు యుద్ధ విరమణ అంటూ క్రమంగా వెనక్కి జారుకున్నారు. అయితే, ఇరాన్‌ మాత్రం..తమకూ అమెరికాకు మధ్య ఎటువంటి చర్చలు జరగలేదని, తాము చర్చలకు సిద్ధంగా లేమని ప్రకటించింది.ఇదిలా ఉండగా నెతన్యాహూ కోసం అమెరికాకు ఏ విధంగానూ అవసరం లేని యుద్ధం చేస్తున్నారన్న. లక్షల కోట్లు ప్రజా ధనం ఖర్చుచేస్తున్నారని భావన అమెరికన్లలో వ్యాపించింది.. మరోవైపు, అమెరికాలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత పెరిగాయి. ట్రంప్‌ కు నాటో మిత్ర దేశాలు సొంత మనుష్యులు కూడా ఈ యుద్ధాన్ని సమర్థించటం లేదు మరోవైపు, ఈ ఏడాది చివర్లో అమెరికా ప్రతినిధుల సభకు ఎన్నికలు జరగనున్నాయి. అధికారపక్షమైన రిపబ్లికన్‌ పార్టీకి పరిస్థితులు ఏమాత్రం సానుకూలంగా లేవన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే, ట్రంప్ ను దింపేయాలి అంటూ ప్రజలు రోడ్లపై నిరసనలు ఊపందుకున్నాయి. ( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *