సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు పార్టీలు సమన్వయంతో పని చేయాలని, కూటమి పార్టీని మరింత బలోపేతం అయ్యేందుకు కృషి చేయాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు పాల్గొన్నారు. భీమవరంలో డంపింగ్ యార్డు, యనమదుర్రు మేజర్ డ్రెయిన్ లపై వంతెనలకు అప్రోచ్ రహదారుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్వర్మ, ఇన్ ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మంత్రి నిమ్మల రామానాయుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి నాయకర్, ఆరిమిల్లి రాధాకృష్ణ, పితాని సత్యనారాయణ, పత్సమట్ల ధర్మరాజు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *