సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరంకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ నేడు, గురువారం రాజ్యసభలో మాట్లాడుతూ.. దేశంలో వెనుకబడిన కులవృత్తుల జీవనోపాధి కార్పొరేట్ కబంధహస్తాల్లోకి వెళ్లిపోయిందని బడుగుల కోసం గళం విప్పారు. దేశంలో రజక నాయి బ్రాహ్మణ వృత్తులతో పాటు మత్స్యకారుల వృత్తులు , చేపలు , రొయ్యలు సేద్యం కూడా కార్పొరేట్ కబంధహస్తాల్లోకి వెళ్లిపోయిందని వాళ్ళు చేస్తున్న దోపిడీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఉప్పు తయారీ నుంచి అన్ని కుల వృత్తుల జీవనోపాధి కార్పొరేట్ పరిధిలోకి వెళ్లిపోవడంతో బడుగులు ఉపాధి కోల్పోతున్నారు.. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు లేవు. ప్రైవేటు రంగంలో బీసీలకు రిజర్వేషన్లు వర్తించవు. సాహజ సిద్ధంగా లభించిన బీసీల జీవన ఉపాధిని కార్పొరేట్ సెక్టార్ బడుగుల నోటి వద్ద కూడును లాక్కుంటే ఎలా? తదితర అంశాలను ఎంపీ పాక తన గళం వినిపించారు. దోపిడీ కి పాల్బదే కొన్ని కార్పొరేట్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం దీనిపై సమగ్రమైన చర్యలు తీసుకోవాలని ఎంపీ పాక, డిమాండ్ చేసారు.
