సిగ్మా తెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ టిడిపి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాలు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక పట్టణ 8,9,14,24,26,35 వార్డులలో నూతనంగా నిర్మించిన టిడిపి జెండా స్థూపాలను ప్రారంభించి టిడిపి జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మీ , టిడిపి రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి మాట్లాడుతూ.. తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజల కోసం ప్రగతి కోసం మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి 43 వసంతాలు పూర్తిచేసుకుని 44వ సంవత్సరంలో అడిగేడుతున్న సందర్భంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ వార్డులలో ఆవిర్భావ దినోత్సవ జెండా పండుగ వేడుక ఘనంగా నిర్వహించుకుంటున్నామని ప్రతి చోటా టిడిపి జెండా ఎగరాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *