సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలోని 10 వ తరగతి విద్య అర్హత మాత్రమే ఉన్న నిరుద్యోగులకు రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు మరో బంపరాఫర్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ (ఏఎల్‌పీ) పోస్టులను రైల్వే శాఖ భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు మే 15, 2026వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.ఈ పోస్టులను సికింద్రాబాద్‌ సహా అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం ఆర్‌ఆర్‌బీ రీజియన్లలో భర్తీ చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *