సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: గల్ఫ్ యుద్ధ ప్రభావంతో బంగారం వెండి ధరలలో రోజు రోజుకి తీవ్ర ఊగిసలాట కనపడుతుంది. ఈ నేపథ్యంలో నిన్న పెరిగిన ధరలు ఈరోజు తగ్గడం జరిగింది. ఈరోజు ట్రేడింగ్ ఆధారంగా బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు సుమారు 1,50,000 నుంచి 1,55,000 రూపాయల మధ్య ఉంది. 22 క్యారెట్ బంగారం సుమారు 1,47,000 రూపాయల వద్ద ఉంది. వెండి కిలోకు 2,46,000 నుంచి 2,50,000 రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. ఉద్రిక్తతలు పెరిగితే బంగారం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. డాలర్ బలంగా ఉంటే ధరలు ఇంకా తగ్గొచ్చు. కేంద్ర బ్యాంక్ సంకేతాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి.
