సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తంగా బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి అంటే నిజాయితీకి ఒక బ్రాండ్. బోఫోర్స్, 2జి స్కాం వంటి ఎన్నో లక్షల కోట్ల కుంభకోణాలు వెలుగు చూశాయి అంటే కరుడు కట్టిన ఈ హైందవ వాదీ చలువే.. మరి ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సుబ్రహ్మణ్య స్వామి తన అధికారిక ఎక్స్ వేదికగా తాజగా చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. ఆయన రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. సీఎం చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో ఈ మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న తీవ్రమైన ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన పాలన స్థానంలో అరాచక పాలన వస్తోందా? ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా స్వామ్యం చచ్చిపోయినట్టేనా? అని తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *