సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: చాల ఏళ్ళ తరువాత “మొన్న ‘సంక్రాంతి సీజన్ లో నారీ నారీ నడుమ మురారి’ సినిమా తో హిట్ కొట్టిన యువ హీరో శర్వానంద్ . ఈసారి ‘బైకర్‌’తో సీనియర్ హీరో రాజశేఖర్ తో కలసి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కధ విషయానికి వస్తే.. వికాశ్ నారాయణ్ (శర్వానంద్)‌కి ఫ్యామిలీయే లోకం. తన భార్య అనన్య (మాళవిక నాయర్), కొడుకు ఇషాన్‌లతో కలిసి హాయిగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడు. తన కొడుకు చదవకపోయినా నవ్వుతూ నవ్విస్తూ ఆడిస్తూ గడిపేస్తుంటాడు. స్కూల్‌లో తన నాన్న గురించి ఫ్రెండ్‌ తప్పుగా మాట్లాడాడని వాడ్ని రక్తం కారేలా కొడతాడు ఇషాన్. ఈ విషయం తెలుసుకున్న వికాశ్‌ ఒక్కసారిగా తన తండ్రిని గుర్తుకుచేసుకొని బాధపడతాడు. వికాశ్ తండ్రి సునీల్ నారాయణ్ (రాజశేఖర్).. ఒక మోటోక్రాస్ రేసింగ్ కోచ్. ఒకప్పుడు ఎన్నో రేసుల్లో ఛాంపియన్ అయిన సునీల్ సరైన ప్రోత్సాహం, ఇండియాలో మోటోక్రాస్ రేసింగ్‌కి అంతగా ఆదరణ లేకపోవడంతో మరోస్థాయికి వెళ్లలేకపోతాడు. దీంతో తన కొడుకు వికాస్‌ని ఒక ఛాంపియన్‌గా తీర్చిదిద్దాలని కోచింగ్ ఇస్తూ ఉంటాడు. తన కొడుకుని ఎప్పటికైనా మోటోక్రాస్ వరల్డ్ ఛాంపియన్‌గా చూడాలని ఒక బడా స్పాన్సరింగ్ కంపెనీని కలుస్తాడు.అక్కడ నుండి కధ మలుపులు తిరుగుతుంది. అది తెరపై చూడవలసిందే.. ఇక సినిమా ను విశ్లేషిస్తే... బైక్ రేసింగ్‌తో ఒక కథని తెరకెక్కించడం ఇండియన్ సినిమా చరిత్రలో బహుశా ఇదే మొదటిసారి. ప్రేక్షకులకు నిజంగా కొత్తదనం పరిచయం చేస్తూ తండ్రి కొడుకుల పెర్ఫామెన్సులు, కథ, కథనం, ఎమోషన్‌తో సినిమాని మరోస్థాయిలో ప్రేక్షకుల ముందు ఉంచాడు డైరెక్టర్ అభిలాష్ రెడ్డి.ముఖ్యంగా బైక్ రైడింగ్ సీన్లన్నీ కూడా థియేటర్లో చూసేటప్పుడు హాలీవుడ్ స్థాయిలో రియల్ రేసింగ్‌ని చూస్తున్న ఫీలింగ్ ఆడియన్స్‌కి కలిగించారు.. క్లైమాక్స్ రేసింగ్ సీక్వెన్స్.. అద్భుతం. శర్వానంద్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసాడు.నటుడిగా అతని సినిమాలలో ఇదే బెస్ట్.. . ఈ రేసర్ కు తండ్రిగా బుల్లెట్ నారాయణ పాత్రలో నటించిన రాజశేఖర్ ప్రేక్షకులకు చాల కాలం గుర్తుండిపోతారు. నిజానికి ఈ కథకి మాత్రం రాజశేఖర్ కూడా హీరోనే. ఎందుకంటే సునీల్ నారాయణ పాత్రే ఈ కథకి ప్రాణం. అలాంటి పాత్రని తన అనుభవంతో, నటనతో మరో స్థాయిలో నిలబెట్టారు రాజశేఖర్. ముఖ్యంగా క్లైమాక్స్‌లో శర్వానంద్‌కి హగ్గు ఇచ్చే సీన్‌లో రాజశేఖర్ నిజంగా ప్రేక్షకులను ఏడిపించారు. హీరోయిన్ గా మాళవిక నాయర్‌, ఇక విలన్‌గా బెంగాలీ సీనియర్ నటుడు అతుల్ కులకర్ణి, బ్రహ్మాజీ, తులసి సహా మిగిలిన యాక్టర్లు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. మొత్తానికి రేసర్ ప్రేక్షకులకు మంచి అనుభూతి ఇచ్చే సినిమా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *