సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇరాన్ అమెరికా చర్చలు విఫలం కావడం తో యూరో దేశాలతో పాటు ఆసియా దేశాలు కూడా.. ఇరాన్ తో కయ్యానికి కాలుదువ్వి ప్రపంచ ప్రజలను సంక్షోభం లోకి నెట్టేసిన అమెరికా తెలివి తక్కువ తనంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. చైనా రష్యా తీవ్ర స్థాయిలో అమెరికాను హెచ్చరించాయి. ఈనేపథ్యంలో .. హోర్ముజ్‌ను తిరిగి తెరుస్తామని, తమ ఆధీనంలోకి తెచ్చుకొంటామని ఇరాన్ ను దిగ్బంధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్చరికలపై,, ఇరాన్ మరోసారి ఘాటుగా స్పందించింది. హోర్ముజ్ ఇప్పటికీ తమ నియంత్రణలోనే ఉందని పేర్కొంది. శత్రువులు ఏ చిన్న పొరపాటు చేసినా భారీ ప్రమాదం తప్పదని హెచ్చరించింది. అంతకుముందు ఇరాన్ సైనిక దళం (ఐఆర్‌జీసీ) కూడా ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చాయి. యుద్ధ విరామం ముసుగులో . హోర్ముజ్ వైపు వచ్చే అమెరికా యుద్ధ నౌకలపై దాడి చేస్తామని హెచ్చరించింది. అయితే పౌర నౌకల రాకపోకలకు మాత్రం ఎలాంటి ఇబ్బందీ ఉండదని భరోసా ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *