సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల అమెరికా అడ్జక్షుడు ట్రంప్ లక్ష్యంగా స్వంత దేశస్తులే హత్య ప్రయత్నాలు కు పాలబడటం అవి విఫలం అయినప్పటికీ ట్రంప్ ప్రాణాలకు ఎంతటి ఆపద పొంచిఉందో తెలియజేస్తుంది. తాజగా గత శనివారం రాత్రి వైట్ హౌస్ కొద్దీ దూరంలో సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్ద కాల్పులకు తెగబడిన వ్యక్తిని నసీర్ బెస్ట్‌(21)గా సీక్రెట్ సర్వీస్ అధికారులు గుర్తించారు. అయితే అతడు సీక్రెట్ పోలిసుల ఎన్కౌంటర్ లో మరణించాడు. మృతుడి మానసిక పరిస్థితిపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నసీర్ బెస్ట్ తనని తాను ఏసుక్రీస్తు మరో అవతారమని నమ్మేవాడని కేసు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. గతంలో వైట్ హౌస్ ప్రాంతంలో నసీర్ బెస్ట్ అనుమానాస్పదంగా తిరిగేవాడు. అతను రెండుసార్లు అరెస్టు అయ్యాడు. అయితే, గత రాత్రి ఆ వ్యక్తి కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ ట్రంప్ లోపల ఉండగానే .. వైట్ హౌస్ ప్రాంతానికి బెస్ట్ వెళ్లి కాల్పులకు తెగబడ్డాడు.ఆ సమయంలో వైట్ హౌస్ లో ఉన్న మీడియా ప్రతినిధులను అక్కడ నుండి వెంటనే తరలించారు. పోలీసులు నింధితుడితో ఎన్కౌంటర్ కాల్పులు జరుపుతున్న సమయంలో ఒక వ్యక్తికీ గాయాలు అయ్యాయి ఈ ఘటనపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. ఈ వరుస హత్యాయత్నాలు భయంతోనే ట్రంప్ ఇటీవల తన కుమారుడి వివాహానికి కూడా హాజరు కాలేదని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *